Samata Sainik Dal Fires on CM Jagan: జగన్​కు ఓట్లు వేసి.. మా గొంతు మేమే కోసుకున్నాం: సమతా సైనిక్ దళ్

🎬 Watch Now: Feature Video

thumbnail

Samata Sainik Dal Fires on CM Jagan: జగన్ ప్రభుత్వానికి ఓట్లు వేసి.. మా గొంతు మేమే కోసుకున్నామని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్​ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలను సీఎం జగన్ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు. వైయస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వంలో కీలక పదవులు అన్నింటిని.. సీఎం జగన్ ఆయన సామాజికవర్గానికి చెందిన వారికే కట్టబెట్టారని పాలేటి మహేశ్​ ఆరోపించారు. ఉన్నతమైన చదువులు, ఇతర అర్హతలు కలిగి ఉన్న దళితులను జగన్ ప్రభుత్వం విస్మరించిందన్నారు. 

రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు నడుస్తున్నాయని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైయస్సార్​ కాంగ్రెస్​ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి.. ఆయనను జైలుకు పంపించిందని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో దళిత, మైనార్టీ, బీసీ మంత్రులు కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే ఉన్నారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా జగన్ ప్రభుత్వానికి చరమ గీతం పాడేందుకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాతో కలిసి సమతా సైనిక్ దళ్ ముందుకు సాగనుందని పాలేటి మహేశ్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.