రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ప్రభుత్వం విఫలం: విపక్ష నేతలు
🎬 Watch Now: Feature Video
Ruling Government Completely Failed to Bring Special Status AP : రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్ష నాయకులు వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యేక హోదా, విభజన హామీలే ఎజెండా కావాలని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు సృష్టం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ 25 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి ఇప్పటివరకుఅలాంటి యోచన చేయలేదని వ్యాఖ్యానించారు.
Opposition Parties Meeting : ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదని, అందరం కలిసి పోరాడితే ప్రత్యేక హోదా సాధించవచ్చని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. గడిచిన 10 సంవత్సరాలలో రాష్ట్రం అభివృద్ధిలో కాకుండా, అప్పుల్లో నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం అనేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని తెలియజేశారు. సంక్రాంతి అనంతరం విభజన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.