Roja Strong Counter to Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండు:రోజా - రోజా తాజా వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video

Roja Strong Counter to Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆటలో అరటి పండు లాంటివారని మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం సభలో పాల్గొన్న మంత్రి.. జనసేనానిపై భగ్గుమన్నారు. అమిత్ షాకు చెప్పి జగనన్నను ఆటాడిస్తానని పవన్ కల్యాణ్ అంటున్నారని, దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేకపోయరని రోజా తెలిపారు. తన సినిమా నాలుగు ఆటలు కూడా ఆడించుకోలేని పవన్ కల్యాణ్ జగనన్నను ఆటాడిస్తా అంటున్నారని రోజా అన్నారు. పవన్ కల్యాణ్‌కు జెండా, ఎజెండా లేవని ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆట ఆడుతున్నారన్న.. ఆమె దత్త పుత్రుడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు, దత్త పుత్రుడు, ఉత్త పుత్రుడు రాష్ట్రంలో మూడు వైపులా తిరుగుతున్నారని, వీళ్ళు ఎన్ని పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రజలు జగనన్నతోనే ఉన్నారని మంత్రి రోజా అన్నారు.