Locals Protest: లారీ ఢీకొని యువకుడు మృతి.. మంత్రి ఆదేశంతో డ్రైవర్ను వదిలేశారంటున్న స్థానికులు - ఏపీ న్యూస్
🎬 Watch Now: Feature Video
Locals Protest: కృష్ణా జిల్లా గూడూరు మండలం గుండుపాలెం అడ్డరోడ్డు సమీపంలో ఓ యువకుడిని రొయ్యల లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుంపటి జాయ్ సన్నీ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రమాదం అనంతరం లారీ ఆపకపోవడంతో లంకపల్లి కాలనీ వాసులు వాహనాన్ని వెంబడించి మోపిదేవి వద్ద పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మంత్రి జోగి రమేష్.. రొయ్యల లారీ మన వాళ్లదే వదిలేయాలని చెప్పాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీంతో లంకపల్లి కాలనీ వాసులు ఉవ్వెత్తున ఎగసిపడేలా ఉద్యమ బాట పట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట గ్రామస్థులు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, స్థానికులకు కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. వాహనం ఎవరిదో తెలిసే వరకూ తాము ఇక్కడే ఉంటామని స్థానికులు చెప్పారు. వాహనం డ్రైవర్ను ఇంతవరకూ పోలీసులు ఎందుకు పట్టుకోలేదని పశ్నించారు. మరోవైపు మృతుని కుటుంబ సభ్యులు కన్నీరు మన్నీరుగా విలపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.