Road Accident in Guntur : టోల్‌గేట్ వద్ద లారీని ఢీకొట్టిన బైక్... భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు.. - గుంటూరులో రోడ్డు ప్రమాదం
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2023, 3:19 PM IST
Road Accident in Guntur : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్‌గేట్ వద్ద ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ రాణిగారితోటకు చెందిన దంపతలు ఆంజనేయులు, శిరీష ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని చూసుకోకుండా ద్విచక్ర వాహనం బలంగా ఢీ కొట్టింది. దీంతో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదంలో భర్త ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి భార్య తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు శిరీషను (మృతుడి భార్య) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Man Died in Lorry Accident : విజయవాడ నుంచి చెత్తను తీసుకెళ్లిన లారీ గురువారం రాత్రి జాతీయ రహదారిపై మరమ్మతులకు గురై నిలిచిపోయింది. అర్థాంతరంగా వాహనం నిలిచిపోవడంతో డ్రైవర్ ఆ వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఈ లారీని ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.