thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2023, 9:58 PM IST

ETV Bharat / Videos

Rich Begging Girls Demands Money: గుంటూరులో రాజస్థాన్ అమ్మాయిల భిక్షాటన.. జాలిపడ్డారో..!

Rich Begging Girls Demands Money:  జీన్స్ ప్యాంట్, రంగుల రంగుల  టీ షర్ట్, కాళ్లకు షూ, మెడలో హ్యాండ్ బ్యాగ్​తో... వారంతా  చూసేందుకు కళాశాల విద్యార్థులు లాగే ఉంటారు. అలా అని వారు ఇంజినీరింగ్ అమ్మాయిలు అనుకుంటే గుంటూరు వాసులు మాదిరి మీరు మోసపోయినట్లే. ఎందుకంటే ఈ యువతులు విద్యార్థులు కాదు. రాజస్థాన్ కు చెందిన  ఈతరం బిచ్చగత్తెలు. రహదారి మీద నిలబడి... ద్విచక్రవాహనాల మీద వెళ్లే వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంటారు. సాయం పేరిట స్థానికుల నుంచి వచ్చిన కాడికి డబ్బులు గుంజుతున్నారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే మార్గంలోని మణిపురం వంతెన, పాత గుంటూరు, పట్నం బజారు తదితర ప్రాంతాల్లో  ఈ అమ్మాయిలు బృందాలుగా తిరుగుతూ... ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వీరి వీడియోలు హల్ చల్ చేయడంతో... జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాలతో 20 మంది యువతుల్ని పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.