పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటన-ఎప్పటిలాగే ఆంక్షలు విధించిన ప్రభుత్వం-బోనస్​గా విద్యార్థులకు సెలవు ప్రకటన! - YSR Rythu Bharosa

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 10:20 AM IST

Restrictions in Puttaparthi : సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన అంటే చాలు ఎక్కడాలేని ఆంక్షలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవడం సర్వసాధారణమైంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో (AP CM Jagan Tour in Puttaparthi) వైఎస్సార్  రైతు భరోసా నిధుల (YSR Rythu Bharosa Funds) విడుదల కార్యక్రమానికి సీఎం  వస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ పాఠశాలకు సెలవు ప్రకటించారు. 

CM Jagan Tour To Release YSR Rythu Bharosa Funds : సీఎం జగన్ సభకు జనాలను తరలించటానికి ప్రైవేట్ పాఠశాల బస్సులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పుట్టపర్తి సభలో సీఎంను నిలదీసేందుకు రైతులతో కలిసి తెలుగుదేశం పార్టీ నేతలు చలో పుట్టపర్తి కార్యక్రమానికి పిలుపును ఇచ్చారు.  తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటన చేయగానే, ఎక్కడికక్కడ పోలీసులు రంగంలోకి దిగి ముందస్తు అరెస్టు చేయటానికి యత్నిస్తున్నారని సమాచారం. 

TDP Leader Kalava Srinivasulu Comments on CM Jagan Tour in Puttaparthi :  ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని జగన్ మోహన్ రెడ్డికి.. పుట్టపర్తిలో సభ నిర్వహించే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.