Dead Body In Canal: రత్నభాస్కర్ డెడ్ బాడీ లభ్యం.. మెడపై గాయాలు - car crashed into canal
🎬 Watch Now: Feature Video
Dead Body In Canal at Chodavaram : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో కలకలం సృష్టించిన కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో కీలక ఆధారం లభించింది. కారులో ఆదృశ్యమైన వ్యక్తి అచూకీ కోసం గాలిస్తున్న పోలీసులకు ఆధారం లభించింది. తోట్లవల్లూరు మండలం చోడవరం వద్ద పంట కాలువలో ఓ మృతదేహం కొట్టుకురాగా.. వల్లూరివారిపాలెం లాకుల వద్ద మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహం చోడవరం వద్ద కాలువలో పడిన కారు యజమాని అవనిగడ్డ వాసి గాజుల రత్నభాస్కర్‌గా పోలీసులు అనుమానించారు. రత్నభాస్కర్ కారులో బట్టలు, సెల్‌ఫోన్‌ను పోలీసులు సోమవారమే స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రత్నభాస్కర్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు మృతదేహం రత్నభాస్కర్‌దేనని గుర్తించారు. మృతదేహం మెడపై గాయాలు ఉండటం.. డెడ్ బాడీ నగ్నంగా లభ్యం కావడంతో ఎవరైనా హత్య చేశారా లేక ఇంకా ఎమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.