Raghuramakrishnan Raju Letter to Governor Regarding CBN Health: చంద్రబాబు ఆరోగ్యంపై రఘురామకృష్ణరాజు గవర్నర్‌కు లేఖ - Raghuramakrishnan Raju news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-10-2023/640-480-19759711-thumbnail-16x9-raghurama.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 13, 2023, 7:49 PM IST
Raghuramakrishnan Raju Letter to Governor Regarding CBN Health: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరోగ్యంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వెంటనే దృష్టి సారించి.. ఆయనకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించాలని గవర్నర్‌ను విజ్ఞప్తి చేశారు.
Raghurama Raju Letter Details: రఘురామకృష్ణరాజు లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం..''మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు డీహైడ్రేషన్, అలర్జీ సమస్యలతో జైలులో బాధ పడుతున్నారు. ఆయన 5 కేజీల బరువు తగ్గినట్లు తెలిసింది. మరింత బరువు తగ్గితే కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఆయన (చంద్రబాబు) ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. హానికర స్టెరాయిడ్లు ఇస్తున్నట్లు సమాచారం వస్తోంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై దృష్టి సారించి.. తక్షణమే ఆయనకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యం అందించాలి" గవర్నర్‌కు రాసిన లేఖలో రఘురామ వివరించారు.