శ్రీవారి సేవలో రాఘవ లారెన్స్ - వేద ఆశీర్వచనం అందించిన పండితులు - jigarthanda doublex

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 5:14 PM IST

Raghava Lawrence Tirumala Visit: తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. జిగర్​ తాండా డబుల్‌ఎక్స్‌ చిత్రం విడుదల సందర్భంగా.. శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో లారెన్స్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు రాఘవ లారెన్స్​కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పొంది.. స్వామివారి తీర్థప్రసాదాలను తీసుకున్నట్లు తెలిపారు. 

మరోవైపు జిగర్​ తాండా డబుల్‌ఎక్స్‌ సినిమా రేపు విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రాఘవ లారెన్స్‌తో పాటు ఎస్​జే సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తన ప్రతి సినిమా రిలీజ్​కు ముందు శ్రీవారి దర్శనం చేసుకోవడం అలవాటు అని రాఘవ లారెన్స్ తెలిపారు. స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తన తరువాత చిత్రం ఏంటి అనే ప్రశ్నకు.. ఇంకా డిసైడ్ చేయలేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ జిగర్​ తాండా డబుల్‌ఎక్స్‌ మూవీ చూసి ఎలా ఉందో చెప్పాలని కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.