R Narayanamurthy on private education విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్న కార్పొరేట్ సంస్థలు.. ఆర్ నారాయణ మూర్తి
🎬 Watch Now: Feature Video
R Narayanamurthy in SV University : పేపర్ లీకేజీల వ్యవహారంతో విద్యా వ్యవస్ధ చిన్నాభిన్నమైనప్పుడు మొత్తం వ్యవస్ధే నిర్వీర్యమవుతుందని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో 'యూనివర్సిటీ' చిత్రానికి సంబంధించిన మూడు పాటలను విద్యార్థుల సమక్షంలో విడుదల (University Movie Songs Release) చేశారు. తన 32వ సినిమా యూనివర్సిటీ అక్టోబరు 4న విడుదల అవుతుందని తెలిపారు. కాసేపు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
తన 32వ సినిమా యూనివర్సిటీ అక్టోబరు 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఆర్ నారాయణమూర్తి తెలిపారు. పేపర్ లీకేజీల కథాంశంగా చిత్రాన్ని రూపోందించామను ఆయన అన్నారు. జీవితం దేవుడు ఇచ్చిన వరమని.. విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడరాదని సూచించారు. తల్లిదండ్రులు సమస్తం దారబోసి చదివిస్తున్నారని.. వారు చేస్తున్న కష్టానికి కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు 1, 2 ర్యాంకులు అంటూ ప్రచారం చేసుకుంటూ విద్యా వ్యవస్థను కల్తీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ఒక్కరు తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అభిమానుల కోరిక మేరకు అభిమానుల కోరిక మేరకు చివరగా 'ఈ ఊరు మనది రా' పాట పాడి నారాయణమూర్తి అలరించారు.
దేశంలోని అన్ని రంగాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేటీకరణ చేస్తున్నారని, పార్లమెంట్ సాక్షిగా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.