దొంగ ఓటర్ల చేర్పు - నకిలీ ఓటర్ కార్డులు ప్రింట్ చేస్తోన్న జగన్​ సర్కార్ : పురందేశ్వరి - Purandeshwari  Comments

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 4:11 PM IST

Purandeshwari Fires on YSRCP Government: జగన్ ప్రభుత్వం దొంగ ఓటర్లను చేర్పించడమే కాకుండా నకిలీ ఓటర్ గుర్తింపు కార్డు తయారు చేసేందుకు సన్నద్ధం అయ్యిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) ఆరోపించారు. నకిలీ ఎపిక్ కార్డులు (Fake Voter ID Cards) ప్రింట్ చేయటానికి వైఎస్స్ఆర్​సీపీ ప్రభుత్వం (YSRCP Government) చంద్రగిరిలో ప్రత్యేకంగా షాపు నిర్వహిస్తోందని పురందేశ్వరి పేర్కొన్నారు.  జగన్ సర్కార్ ఓటరు నమోదు ప్రక్రియలో అక్రమాలకు పాల్పడుతోందని విరుచుకుపడ్డారు. ఈరోజు రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ముగ్గురు బీజేపీ నేతలు కలిసి ఓట్ల అక్రమాలపై వారికి ఫిర్యాదు చేశారని పురందేశ్వరి తెలిపారు. 

Purandeshwari Comments: జగన్ సర్కార్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను జరపటం లేదని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు సైతం సక్రమంగా ప్రజా ఉపయోగానికి  ఖర్చు చేయడం లేదని తమ పర్యటనలో తేటతెల్లం అయిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఓసారి అవకాశం తమకు ఇవ్వాలని పురందేశ్వరి కోరారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.