Pudimadaka apiic Package టీడీపీ హయాంలో విడుదల చేసిన పూడిమడక ప్యాకేజీ నిధులు ఎక్కడ? ఎప్పుడు ఇస్తారు..? - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Pudimadaka Villagers Waiting For Package : అనకాపల్లి జిల్లా పూడిమడకలో 2016లో ఎపీఐఐసీ వేసిన పైప్‌లైన్ ప్రాజెక్టు ద్వారా గ్రామస్థులకు రావాల్సిన ప్యాకేజీ ఇప్పటికీ రాలేదు. దీని కోసమని వారు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నామంటూ వాపోతున్నారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ చాలా తక్కువని తాము అధికారంలోకి వస్తే ఏకంగా ఐదు లక్షలు ఇస్తామని నమ్మబలికిన వైఎస్సార్సీపీ పెద్దలు, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తర్వాత ఆ విషయమై ఎటువంటి ముందడుగు వేయలేదు. పైగా ఇందులో అప్పటి పరిహారం పంపిణీలో అవకతవకలు జరిగాయన్నది తాజాగా చేస్తున్న ఆరోపణలు. వైఎస్సార్సీపీ నాయకులు ఆ గ్రామం వైపు కన్నెత్తైనా చూడటం లేదు. దీంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వస్తున్న ప్రజాప్రతినిధులను గ్రామస్థులు అడ్డగిస్తున్నారు. పరిహారం వారికి ఎందుకు అందడం లేదన్న దానికి సమాధానం రావడం లేదు. నాలుగు సంవత్సరాలైనా ప్యాకేజీ గురించి పట్టించుకోవడం లేదంటూ నిలదీస్తున్నారు. ప్యాకేజీ కోసం నాలుగు సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న పూడిమడక వాసులతో ముఖాముఖీ.