Public left from CM meeting: సీఎంకు నిరుద్యోగ నిరసన సెగ.. జగన్ మాట్లాడుతుంటే వెళ్లిపోయిన జనం - నాలుగో విడత అమ్మ ఒడి
🎬 Watch Now: Feature Video
The crowd left while Chief Minister Jagan was speaking: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చిన జనం సభ ప్రారంభం నుంచే వెళ్లిపోవడం ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నాలుగో విడత అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభానికి ముఖ్యమంత్రి విచ్చేశారు. స్థలాభావం, ఉక్కపోత కారణాలతో సభ ప్రారంభానికి ముందు నుంచే వెనుదిరిగారు. అమ్మఒడి నాలుగో విడత నిధుల విడుదలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జనం చాలా మంది సభ ప్రారంభానికి ముందు నుంచే వెనుతిరగడం ప్రారంభించారు. స్థలాభావంతో ఇబ్బందులు పడుతూ చాలామంది చెట్లు, పొలాల గట్లపైన ఉండిపోయారు. ఉదయం వర్షం కురవడంతో పది గంటల తర్వాత ఉక్కపోత ఎక్కువగా వేధించింది. దీంతో జనం గుడారంలో ఉండకుండా ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. చాలా మంది సీఎం జగన్ ఉపన్యాసం కూడా వినకుండా వెనుతిరిగి వెళ్లిపోయారు. దూరప్రాంతాల నుంచి బస్సుల్లో వచ్చిన వారు ఆ బస్సులు వద్దకు చేరుకొని సేద తీరారు. మరోవైపు సీఎం ప్రసంగించే సభ ప్రాంగణం బయట కొందరు నిరుద్యోగ యువత నిరసన తెలిపారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. క్లస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, ఏహెచ్ఏ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.