SC Railway Zone with four divisions headquartered at Visakha: విశాఖ రైల్వే జోన్ విషయంలో మరో కీలక అడుగుపడింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో దక్షిణ కోస్తా డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న వాల్తేరు డివిజన్‌ను విశాఖపట్నం డివిజన్‌గా పేరు మారుస్తున్నారు.
132 సంవత్సరాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్‌ను కొనసాగిస్తూ, దానిని విశాఖ డివిజన్‌గా పునర్నామకరణం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఎంపీ భరత్ అన్నారు. విశాఖ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకున్న ఈ నిర్ణయం నగర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇది కూటమి ప్రభుత్వం మరో విజయమని అభివర్ణించారు.
విశాఖ డివిజన్ ఏర్పాటుతో రైల్వే మౌలిక వసతులు మరింత అభివృద్ధి చెందుతాయని, కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మరింత మద్దతు లభించే అవకాశం ఉందన్నారు. కొత్త రైళ్లు, మెరుగైన ప్రయాణ సౌకర్యాలకు ఇది కీలక పరిణామం అని భరత్ చెప్పారు.
పరవాడ ఫార్మాసిటీ మైదానంలో ‘వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్‌పో
ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు - నాలుగేళ్లలో అమరావతికి రైల్వే లైన్