Protest to MLA Jonnalagadda Padmavathi: 'దళిత ఎమ్మెల్యే.. ఓసీల బినామీ' - Protest Against To MLA Jonnalagadda Padmavathi
🎬 Watch Now: Feature Video
Protest Against To MLA Jonnalagadda Padmavathi In Putlur: వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు నిరసన సెగ తగలడం సర్వసాధరణం అవుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన అధికార పార్టీకి చెందిన దళిత నేత, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరుకే దళిత ఎమ్మెల్యే అని.. ఆమె ఓసీల బినామీ అంటూ నినాదాలు చేశారు.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో సింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది. గడపగడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రంగమయునిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ క్రమంలోనే దళితులను తీసేసీ అగ్రవర్ణాల వారిని ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియమించడంపై వైఎస్సార్సీపీ దళిత నేత జగదీశ్ ఎమ్మెల్యేను నిలదీశారు. అవేమి పట్టించుకోకుండా ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే పట్టనట్లు వ్యవహరించడం భావ్యం కాదంటూ వైఎస్సార్సీపీ దళిత వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జొన్నలగడ్డ పద్మావతి ఓసీల బినామీ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరపకుండా తాడపత్రి ఎమ్మెల్యే వర్గీలను పోలీసులు ముందుగానే హెచ్చరికలు చేశారు.