Protest against MLA: 'రోడ్లు వస్తున్నాయి.. దారిలో ఉన్నాయి'.. మహిళలతో వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే తీరు

🎬 Watch Now: Feature Video

thumbnail

Protest against YCP MLA: తమ సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్​సీపీ నాయకులను అడిగితే ఆగ్రహం. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే భౌతిక దాడులు ఇది ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు. తాజాగా ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో ఇదే తరహా సంఘటన చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలం భోగోలు గ్రామంలో ఎమ్మెల్యే ఎలిజా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి అందిన పథకాలను స్థానికులకు చదివి వినిపిస్తున్న సమయంలో ఎమ్మెల్యే ఎలిజాకు చేదు అనుభవం ఎదురైంది. గ్రామంలో కొంతమంది మహిళలు రహదారులు అధ్వానంగా ఉన్నాయని ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో ఆయన రహదారులు వస్తున్నాయి దారిలో ఉన్నాయని వ్యగ్యంగా సమాధానం చెప్పారు. మరొక చోట మహిళలు తమకు ఇళ్లు లేవని, కొంతమంది పట్టాలు లేవని, తాగునీరు సక్రమంగా రావడం లేదని ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

న్యూస్​టుడే విలేకరిపై దౌర్జన్యం.. ఇదంతా అక్కడే ఉన్న లింగపాలెం మండలం న్యూస్​టుడే కంట్రీబ్యూటర్ తన చరవాణీలో చిత్రీకరిస్తుండగా.. అది గమనించిన ఎమ్మెల్యే ఎలిజా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతని చరవాణీలో ఉన్న వీడియోలు, ఫొటోలు తొలగించాలని తన పీఏ సామ్యూల్​ను ఆదేశించారు. అతడు న్యూస్​టుడే కంట్రీబ్యూటర్ శ్రీనివాసరావు నుంచి చరవాణి బలవంతంగా లాక్కొని అందులో ఉన్న ఫొటోలు, వీడియోలు తొలగించి ఇచ్చారు. ఇదంతా అక్కడే ఉండి చూస్తున్న స్థానికులు.. ఎమ్మెల్యే ఎలిజా, అతని అనుచరులపై అసహనం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.