ETV Bharat / state

దేశంలో ఏపీది రెండోస్థానం - రాష్ట్రంలో 24 జిల్లాల్లో అధికంగా ఆ వ్యాధి బాధితులు

ఏపీలో పెరుగుతున్న ఎయిడ్స్ కేసులు - ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా 19,865 మంది రోగులు

AIDS Cases in AP
AIDS Cases in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

AIDS Cases in AP : ఆంధ్రప్రదేశ్​లో ఎయిడ్స్‌ విస్తృతి 24 జిల్లాల్లో అధికంగా ఉంది. ఈ మేరకు నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ హెచ్‌ఐవీ ఎస్టిమేట్స్‌ 2023 నివేదికను విడుదల చేసింది. ఇందులో ఈ విషయాన్ని ప్రకటించింది. మొత్తం 3.20 లక్షల హెచ్‌ఐవీ రోగులతో దేశంలో రెండో స్థానంలో ఉన్న ఏపీలో ప్రతి సంవత్సరం 3510 మంది దీనిబారిన పడుతున్నట్లు తేలింది. 2023లో రాష్ట్రంలో 5310 మంది ఈ రోగానికి గురై మరణించారు.

ఈ విషయంలో మహారాష్ట్ర (7,460), మిజోరం (5,600) తర్వాతి స్థానంలో ఏపీ నిలిచింది. ఆంధ్రప్రదేశ్​లో ప్రతి మిలియన్‌ జనాభాకు 6051 మంది హెచ్‌ఐవీ రోగులున్నారు. హెచ్‌ఐవీ విస్తృతి 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో 0.62 శాతం మేర నమోదైంది. ఇది జాతీయ సగటు 0.20 శాతం కంటే అధికం. అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 19,865 మంది హెచ్‌ఐవీ రోగులున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కాకినాడ జిల్లాలో (18,234), తూర్పుగోదావరి జిల్లాలో (17,618), పల్నాడు జిల్లాలో (17,536), గుంటూరు జిల్లాలో (16,630), ప్రకాశం జిల్లాలో (16,280) ఉన్నాయి. అదేవిధంగా విశాఖపట్నం (15,999), పశ్చిమగోదావరి (15,612), ఏలూరు (15,573), అనంతపురం (14,862), అనకాపల్లి (13,491), కృష్ణా (13,166), శ్రీసత్యసాయి (11,089), బాపట్ల (11,356), డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ (10,567) జిల్లాలు ఉన్నాయి.

మిగిలిన జిల్లాల్లో రోగుల సంఖ్య 10,000 లోపు ఉంది. 2023లో ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా 542 మందికి హెచ్‌ఐవీ బారిన పడ్డారు. ఆ తర్వాతి స్థానాల్లో విశాఖపట్నం జిల్లాలో (345), అనకాపల్లి జిల్లాలో (239), అనంతపురం జిల్లాలో (235), శ్రీసత్యసాయి జిల్లాలో (231) ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో కొత్తగా ఎయిడ్స్ బారినపడ్డ రోగుల సంఖ్య 200ల్లోపు ఉంది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో1408, పార్వతీపురం మన్యం జిల్లాలో 3642 మంది రోగులున్నారు. 2023లో అత్యల్ప సంఖ్యలో కొత్తగా వైరస్‌సోకిన జిల్లాల్లో గుంటూరు, వైఎస్సార్‌ కడప, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉన్నాయి.

HIV Cases Increased in AP : ఒకరికంటే ఎక్కువ మందితో శృంగారం, కండోమ్‌ వాడకపోవడం, కలుషిత సిరంజీల వాడకం, రక్తమార్పిడి వల్ల హెచ్ఐవీ సోకుతోంది. వ్యాధికి గురైన వారిలో రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ముఖ్యంగా సీడీ4 కణాల సంఖ్య తగ్గుతాయి. తద్వారా వైరస్‌ సోకిన వ్యక్తుల్లో ఇతర ఇన్‌ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఫలితంగా రోగాలబారిన పడి ప్రాణాలు కోల్పోతారు.

'ఎయిడ్స్​ వల్ల నిమిషానికి ఒకరు మృతి - 4 కోట్ల మందికి HIV' - UNAIDS Report

ఏపీలోనే సెక్స్ వర్కర్లు ఎక్కువ..! నివ్వెరపరుస్తున్న కేంద్ర గణాంకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.