Natti Kumar on MLA Dwarampudi: పవన్ ఎలాంటివారో సినీ పరిశ్రమకు తెలుసు.. ఎమ్మెల్యే ద్వారంపూడిపై నిర్మాత నట్టి ఆగ్రహం - ap news
🎬 Watch Now: Feature Video
Produce Natti Kumar Angry on MLA Dwarampudi Chandrasekhar Reddy : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలను ప్రముఖ సినీ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా ఖండించారు. తప్పుడు సమాచారంతో చంద్రశేఖర్ రెడ్డి పవన్ కల్యాణ్ డ్రగ్స్ తీసుకుంటారంటూ ఆరోపణలు చేశారని, అవి నిరూపించని పక్షంలో పవన్ కల్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఎలాంటి వారో సినీ పరిశ్రమ మొత్తానికి తెలుసని పేర్కొన్న నట్టి కుమార్.. ద్వారంపూడి తీరును తప్పు పట్టారు. అలాగే కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్‌పై ఎందుకు కక్ష కట్టారని ఆయన ప్రశ్నించారు. కాపుల్లో నుంచి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నట్లు నట్టి తెలిపారు. అయితే తాను జనసేన పార్టీ తరపున మాట్లాడటం లేదని, తనకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. కేవలం పవన్‌పై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే సినీ నిర్మాతగా స్పందిస్తున్నానని నట్టి కుమార్ వివరించారు.