'వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేదు' - ఏపీ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-01-2024/640-480-20540998-thumbnail-16x9-prodduturu-ex-mla-varadarajula-reddy-fires-on-ysrcp-govt.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 19, 2024, 6:56 AM IST
prodduturu Ex- MLA Varadarajula reddy Fires On YSRCP Govt : జగన్ ప్రభుత్వంలో దుర్మార్గమైన పాలన జరుగుతోందని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రజలు, వ్యాపారుల డబ్బును పోలీసులు సీజ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తె వివాహానికి బంగారం కొనేందుకు తెచ్చుకున్న డబ్బును పోలీసులు సీజ్ చేయడం దారుణమన్నారు. పెళ్లి నగల కోసం తెచ‌్చుకున్న డబ్బుని సీజ్ చేస్తే ఆ వివాహం ఎలా జరుగుతుందని, ఆ కుటుంబ పరిస్థితి ఏమవ్వాలని భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ దుర్మార్గం జరుగుతోందని మండిపడ్డారు. అధికారులకు ఈ అరాచకాలకు ఆదేశాలు ఎవరు ఇస్తున్నారో అందరికీ అర్థమవుతుందన్నారు. ఎలక్షన్ కోడ్ అమలు కాకముందే ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని వైఎస్సార్సీపీని పాలనను ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వ్యతిరేకించారు.