Bus Accident అసలే గతుకుల రోడ్లు, ఆపై వర్షాలు..! జాగ్రత్తగా వాహనాన్ని నడపండి డ్రైవర్ గారు..! - కాలువలో పడ్డ ప్రైవేటు స్కూల్ బస్సు
🎬 Watch Now: Feature Video

Private School Bus Fell Into Canal At Aravapalem Village: నెల్లూరు జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్ సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరులో ఓ శుభకార్యానికి ఓ ప్రైవేట్ స్కూల్ సిబ్బంది, స్కూల్ బస్సులో వెళ్ళారు. అనంతరం శుభకార్యం చూసుకుని తిరిగి ఆత్మకూరు వైపు వెళ్తూ సంగం మండలం అరవపాలెంలో కొంతమంది సిబ్బంది దిగారు. సదరన్ చానల్ కాలువ నుంచి వెళుతున్న సమయంలో స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు కాలువలో బోల్తా పడింది. వెంటనే స్థానిక ప్రజలు అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఉన్న సిబ్బందిని బయటకు తీశారు. కాలువలో నీరు తక్కువగా ఉండటంతో బస్సులో ఉన్న సుమారు 30 మంది సిబ్బందికి పెను ప్రమాదం తప్పింది. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఓ వైద్యశాలకు తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని సురక్షితంగా మరో వాహనంలో ఆత్మకూరుకి తరలించారు.