Pratidhwani: అంగన్‌వాడీ వర్కర్ల పోరాటాలపై వైసీపీ సర్కార్ ఉక్కుపాదం.. ఇచ్చిన హామీలను మరిచి, వేధింపులు! - అంగన్‌వాడీ వర్కర్ల పోరాటాలపై వైసీపీ ఉక్కుపాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 10:00 PM IST

Updated : Sep 26, 2023, 10:50 PM IST

Pratidhwani Debate on Why Anganwadi Workers Agitating : హామీల అమలు కోసం మరోసారి రాష్ట్రంలో ఆందోళనబాట పట్టారు అంగన్‌వాడీ వర్కర్లు. తమకిచ్చిన మాట మేరకు ఉద్యోగభద్రత.. కనీస వేతనం పెంపు, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలూ అందించాలని కదం తొక్కారు. ఎప్పటి నుంచో ఉన్న ఈ విన్నపాలకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేక పోవడానికి తోడు.. కొంతకాలంగా పెరిగిన వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టామని ప్రకటించారు. వారి ఉద్యమంపై ప్రభుత్వం అణచివేతలు సరే.. అసలు పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చింది?

రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ల సాధనకు ఉద్యమిస్తున్న అంగన్‌వాడీలు ఇప్పుడు ఆ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశారు. ప్రస్తుతం ఆందోళనలకు ప్రధాన కారణాలు ఏమిటి? అసలు ప్రతిపక్షంలో ఉండగా జగన్ మీకు ఏం హామీలు ఇచ్చారు? వాటి అమలు కోరుతూ ప్రస్తుతం అంగన్వాడీలు చేపట్టిన ఉద్యమంపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది? అంగన్‌వాడీల ఉద్యోగ భద్రత, సంక్షేమం విషయంలో సుప్రీం కోర్టు తీర్పులో ఏం చెప్పారు? రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎలా అమలు చేస్తోంది?  అంగన్‌వాడీల సమస్యలేంటి? వారికి జగన్ ఏం చెప్పారు? ఏం చేశారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Last Updated : Sep 26, 2023, 10:50 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.