Pratidhwani: జగన్ సర్కారు తీరుపై కాగ్ తన నివేదికలో ఏం పేర్కొంది?
🎬 Watch Now: Feature Video
Pratidhwani Debate on CAG Report: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది అడ్డగోలు నిర్ణయాలతో ప్రజల జీవితాల్ని దుర్భరం చేస్తున్నారని విపక్షాలు గొంతెత్తితే చాలు ఒంటి కాలి మీద లేస్తుంది జగన్ సర్కారు. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ హయంలో 2019 తర్వాత జరిగిన నిర్వాకాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందు చర్చకు పెట్టింది కాగ్ నివేదిక. 2021 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల అయిన కాగ్ నివేదికలో అనేక కీలకాంశాలు ప్రస్తావించింది. అమరావతి ఆగిపోవడం జరిగిన నష్టం, స్థానిక సంస్థల విషయంలో, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటులో రాజ్యాంగస్ఫూర్తినే పక్కన పెట్టిన ఒంటెత్తు పోకడలు, విశాఖ వంటి నగరాల దుస్థితి, మరెన్నో లోపాలు, ఆర్థికకష్టనష్టాలపై వివరించింది. అసెంబ్లీలో కాగ్ ప్రవేశ పెట్టిన నివేదిక ప్రభుత్వం పనితీరు గురించి స్థూలంగా ఏం చెప్పింది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కీలకమైన ప్రాజెక్టులను పక్కన పెట్టేయడం వల్ల జరిగిన నష్టం ఏమిటి? అమరావతిపై 2019 నుంచి జగన్ సర్కారు తీరుపై కాగ్ తన నివేదికలో ఏం పేర్కొంది? అదే విషయాలపై నేటి ప్రతిధ్వని.