Prathidwani: విపత్తుల వల్ల కలిగిన నష్టాన్ని వైసీపీ ప్రభుత్వం ఏ మేరకు భర్తీ చేసింది? - AP Latest News
🎬 Watch Now: Feature Video
Prathidwani: రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. బాగుపడినట్లు చరిత్రలో లేదు.. అన్నది పెద్దలు తరచూ చెప్పే హితోక్తి. అదేబాటలో తమ ప్రభుత్వం సాగుతోంది.. అంటున్న సీఎం జగన్ రైతులకు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తున్నాం అంటున్నారు. మరి రాష్ట్రంలో రైతులందరూ నిజంగానే బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? రైతు భరోసా సాయం విడుదల సందర్భంగా రాష్ట్రంలో రైతన్నల విషయంలో ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు.. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనకు పొంతన ఎంత? రైతుభరోసా కేంద్రాల నుంచి ఉచిత పంటల బీమా మాటల వరకు.. అంతెందుకు కళ్లముందే కనిపిస్తున్న ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలకు జరిగిన పంటనష్టం సాయాలు ఏం చెబుతున్నాయి? వైసీపీ ప్రభుత్వం తరచూ చెబుతున్న మాట రైతు భరోసా కేంద్రాల గురించి. జగన్ అంటున్నట్లు నిజంగా అవి ప్రతి గ్రామంలో రైతుల్ని చేయిపట్టి నడిపిస్తున్నాయా? వైసీపీ మేనిఫెస్టోలో ఎంతోకాలంగా అందరూ చర్చించుకుంటున్న విషయం.. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, 4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు.. వాస్తవ పరిస్థితి ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.