PRATHIDWANI: ఏఐ విప్లవం ఎటు తీసుకెళ్లనుంది? - ఇంటర్నెట్ సెర్చింగ్ పై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI: సిరి.. గూగుల్ అసిస్టెంట్ నిన్నటి మాట. చాట్ జీపీటీ, గూగుల్ బార్డ్... ఇప్పుడు ట్రెండింగ్ అంతా ఇవే. ఇప్పుడు అన్నింటికీ ఏఐ చాట్‌బాట్‌లే. గురువు, మార్గదర్శకుడు, సహాయకుడు, స్నేహితుడు.. అన్నీ అవే. రూపు మారుతున్న ఈ ఇంటర్నెట్ సెర్చింగ్ విధానంపై పట్టుకోసం దిగ్గజ టెక్‌సంస్థలు తీవ్రస్థాయిలో తలపడుతున్నాయి. ఈ కృత్రిమమేధా విప్లవం మన జీవితాల్ని ఎలా మార్చనుంది? మంచిచెడు తర్కం, ప్రణాళిక, దృక్పధాల ఆధారంగా సాగే మానవమేధ... కంప్యూటర్ సిస్టమ్ ఆధారంగా సాగే ఏఐని ప్రత్యమ్నాయం అనుకోగలమా? ఈ చాట్‌బోట్‌ల తరం మనిషి మెదడుకు మరింత పదును పెడుతుందా... పూర్తిగా సోమరుల్ని చేసి కూర్చోపెడుతుందా...? కృత్రిమ మేధపై నైతికత, భద్రతపరమైన ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.