PRATHIDWANI రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ కూటమి బలపడనుందా - alternative alliance aganist bjp
🎬 Watch Now: Feature Video
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి. కొద్దిరోజులుగా మరొకసారి ఈవిషయంపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. భాజపాను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, వామపక్షాలు సహా విపక్షాలన్నీ కలిసి ప్రధాన ఫ్రంట్‌గా ఏర్పడాలన్న బిహార్ సీఎం నీతీశ్ కుమార్ పిలుపు ఆ చర్చను మరింత ముందుకు తీసుకుని వెళ్లింది. అలా ఏకమైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కమలదళాన్ని ఓడించడం సాధ్యం అన్నది ఆయన జోస్యం. లక్ష్యం భారీగానే ఉన్నప్పటికీ.. అసలు.. కొత్త కూటమిలోకి ఏయే పార్టీలు వచ్చే అవకాశం ఉంది? ఆయా పార్టీలకు ఏయే రాష్ట్రాల్లో బలం ఉంది? త్వరలో రానున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో అవి చూపించే ప్రభావం ఎంత? రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ ప్రత్యమ్నాయ కూటమి ఏ రూపంలోనైనా బలపడే అవకాశం ఉందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST