Prathdwani: రాష్ట్రంలో మహిళల భద్రతకు భరోసా ఎక్కడ..? - మహిళల భద్రతకు భరోసా ఎక్కడ అనే అంశంపై నేటి ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకున్న దారుణం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి హేయమైన ఘటన జగరగడం.. ఆ సమయంలో బాధితుల ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరు గురించే ఇప్పుడు చర్చ అంత. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు సత్వరం చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ అలా జరగపోవడం బాధితురాలికి 30 గంటలకు పైగా నరకాన్ని మిగిల్చింది. చివరకు బాధిత కుటుంబ సభ్యులే వెళ్లి తమ కుమార్తెను రక్షించుకున్న దయనీయమైన పరిస్థితి. ఈ ఒక్కటే కాదు.. కొన్నాళ్లుగా రాజధాని ప్రాంతంలో జరుగుతున్న మహిళలపై అఘాయిత్యాల్ని ఎలా చూడాలి..? ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో మిగిలినచోట్ల ఆడవారి భద్రతకు భరోసా ఎక్కడ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST