Prathidwani: వాలంటీర్​ వ్యవస్థను పావుగా వాడుకుంటున్న ప్రభుత్వం..! - వాలంటీర్ల వ్యవస్థపై పవన్​ ఆగ్రహం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 15, 2023, 11:02 PM IST

Prathidwani: రాష్ట్రంలో ప్రజల వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కు అంగటి సరకుగా మారింది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ఆరోపణ ఇది. ఏటా ఏకంగా 6 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును వేతనాలుగా ఇస్తూ నిర్మించిన వాలంటీర్ వ్యవస్థనే ఇందుకు పావుగా వాడుతున్నారన్న ఫిర్యాదులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి . వైకాపా నేతలు, పార్టీ సలహాదారులు, మంత్రులు పచ్చిగా.. వాళ్లు మా మనుషులే అని చెప్పుకోవటం సమర్థనీయమేనా ? అన్న చర్చ జరుగుతున్న తరుణంలో తెరపైకి వచ్చిందీ వివాదం.  అసలు ప్రజల వ్యక్తిగత సమాచార గోప్యతపై రాజ్యాంగం ఏం చెబుతోంది ? ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతోంది ? ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐప్యాక్ కావొచ్చు.. మరో సంస్థ కావొచ్చు.. ప్రైవేటు వారి చేతుల్లో ప్రజల సమాచారంతో పొంచి ఉన్న ప్రమాదమేంటి ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చ చేపట్టింది. ఈ చర్చలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, సైబర్ వ్యవహారాల నిపుణుడు నలమోతు శ్రీధర్​లు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.