అమరావతిని దెబ్బకొట్టలనే కుయుక్తులకు చెక్‌ - సీఎం జగన్ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో షాక్ - amaravati farmers protest

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 5, 2024, 10:17 PM IST

Prathidwani Debate: ఆంధ్రుల రాజధాని అమరావతిని దెబ్బకొట్టాలని సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. అమరావతి రాజధాని కేసుతో పాటు ఆర్‌ ఫైవ్‌ జోన్‌లో ఇళ్లస్థలాల కేటాయింపు కేసులోనూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ రెండు కేసులూ ఏప్రిల్‌కు వాయిదా పడ్డాయి. తాను సీఎంగా ఉండగానే ఏపీ రాజధానిగా అమరావతిని లేకుండా చేయాలని జగన్ చేసిన కుట్రలకు కాలం చెల్లినట్టేనా? మూడు రాజధానుల ముచ్చట ముగిసినట్టేనా? 2019 డిసెంబర్‌లో సీఎం జగన్ మూడు రాజధానుల వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఆరోజు నుంచి నేటివరకు రాజధానిని కాపాడుకోవటం కోసం రైతులు అనేక త్యాగాలు చేశారు. 

అలుపెరగని రాజధాని రైతుల పోరాటం దేశచరిత్రలోనే నిలిచిపోనుందా? పాలనా రాజధాని పేరుతో దొడ్డిదారిన విశాఖకు తరలించాలన్న ప్రయత్నాలు కూడా వమ్ము అయినట్టేనా? విశేషమైన ప్రజాతీర్పును సాధించిన ఓ బలమైన ప్రభుత్వంతో, ఒక నియంతవంటి ముఖ్యమంత్రితో రాజధాని రైతులు తలపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచి, సీఎం కుట్రలను భగ్నం చేసి వీధిపోరాటాలు, న్యాయపోరాటాలతో అమరావతిని నేటివరకూ నిలబెట్టుకున్నారు. ఇది దేశచరిత్రలో ఒక ఉద్యమపాఠంగా నిలిచిపోతుందా? ప్రజాధనాన్ని, పర్యావరణాన్ని నాశనం చేసి అంతిమంగా ఏం సాధించినట్టు? ఇదీ నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.