అరచేతిలో వైకుంఠం - రోడ్డున పడ్డ ఉపాధ్యాయ ఉద్యోగులు
🎬 Watch Now: Feature Video
CM Jagan Cheating Teachers And Employees: జగన్ సీఎం అయితే జీతాలు బాగా పెంచుతాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒకటో తారీఖున జీతాలివ్వండి మహాప్రభో అని ఉద్యోగులు అంటున్నారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను వారంలో రద్దు చేస్తానని చెబితే నమ్మారు. ఇప్పుడు ఉన్న పెన్షన్లే టైమ్‌కు ఇవ్వట్లేదని ఆందోళన చెందుతున్నారు. అంతెందుకు తమ జీతాలు తమకు సకాలంలో ఇవ్వటానికి, తాము దాచుకున్న డబ్బులు చెల్లించటానికి కూడా జగన్ ప్రభుత్వం ఉద్యోగులను రోడ్డెక్కి పోరాడేలా చేస్తోంది. సుమారు 18 వేల కోట్ల రూపాయలు ఉపాధ్యాయ ఉద్యోగుల డబ్బులు ప్రభుత్వం వాడుకుంది. ఉపాధ్యాయ ఉద్యోగులు ఈరోజు ఎందుకు రోడ్డున పడాల్సి వచ్చింది? కొన్నిచోట్ల అరెస్టులు కూడా అవుతున్నారు. పాఠాలు చెప్పాల్సిన గురువులకి ఏంటీ పాట్లు. ఇప్పటికే పంచాయతీల నిధులన్నీ ప్రభుత్వం వాడేసుకుందని సర్పంచ్‌లు ఆందోళన చేస్తున్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన డబ్బులు కూడా వాడుకుందా ప్రభుత్వం. అసలు ఉపాధ్యాయ ఉద్యోగులకు జగన్ అరచేతిలో వైకుంఠం ఎలా చూపించారు? వారెలా మోసపోయారు? వారి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇదీ నేటి ప్రతిధ్వని.