నిత్యం భయపడుతూ బతకాల్సిందే - పల్నాడులో వైసీపీ అరాచక పాలన - ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 24, 2023, 10:28 PM IST
Prathidwani: అక్కడ బతకాలంటే.. స్థానిక ప్రజాప్రతినిధులకు జీ హుజూర్ అనాల్సిందే. మట్టి నుంచి మద్యం వరకు కప్పం కట్టాల్సిందే. ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తుల కబ్జాకు లెక్కే లేదు. విపక్ష నేతలపై దాడులు, ప్రజాసంఘాలు, ప్రశ్నించిన వారిని వెంటాడి వేధించడం ఇక్కడ షరా మాములు అయిపోయింది. దారుణ హత్యల నుంచి.. ఊరి నుంచి వెళ్లగొట్టే దాష్టీకాల వరకూ ఎన్నో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికీ కేరాఫ్ అడ్రస్.. పల్నాడు ప్రాంతం. కొట్టినా, తిట్టినా, చివరకు చంపేసినా.. అక్కడ వైసీపీ నాయకులు చెప్పిందే శాసనం... చేసిందే చట్టం అన్నట్లు ఇక్కడ పరిస్థితి మారిందని విపక్షాలు, ప్రజాసంఘాలు వాపోతున్నాయి. అక్రమ మైనింగ్ అంత పచ్చిగా జరుగుతుంటే గనుల శాఖ, పోలీస్ శాఖ ఏం చేస్తున్నాయి? ప్రజాసంపద దోపిడీని అడ్డుకోవటానికి ఎవరన్నా ప్రశ్నిస్తే వారు ఎటువంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది? మరో అయిదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. స్థానిక ఎన్నికల్లోనే వైసీపీ భయభ్రాంతులు సృష్టించింది. ఇంక అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎటువంటి పరిస్థితులు ఊహించవచ్చు? ఎప్పుడూ లేనంతగా పల్నాడులో ఇంత హింస, ఇంత అరాచక పరిస్థితులకు అసలు కారణమేంటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.