అధికారపక్షాన్ని వీడుతున్న నేతలు - వైసీపీలో అలజడికి కారణం ఏంటి?
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 10:20 PM IST
Prathidwani Debate: ఒక్కసారిగా అధికార వైసీపీలో కలకలం చెలరేగింది. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా రాజుకుంది. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఇప్పటికే తెలుగుదేశంలో చేరగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు, ఎమ్మెల్సీల్లోనూ అధినేత జగన్ తీరుపై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎందుకని ఒక్కసారిగా అధికార వైసీపీ నుంచి ఆ పార్టీ నాయకులు బయటకు పరుగులు తీస్తున్నారు? ఎందుకు బైబై జగన్ అంటున్నారు?
వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటం, మళ్లీ గెలిచే పరిస్థితి లేకపోవటమే కారణమా? పార్టీలో గౌరవం దక్కకపోవటమూ దానికి తోడైందా? ఏనాడు తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిచి ప్రజాప్రతినిధులతో మాట్లాడని ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు వరుసగా అందరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వటానికి కారణం ఏంటి? వైనాట్ 175 అనే డైలాగులు ఇప్పుడు ఎందుకు వైసీపీ నాయకుల నోటి నుంచి రావట్లేదు? జగన్ గెలుపునకు కారణమైన ప్రశాంత్ కిషోర్ వంటి వారు, చివరకి సొంత చెల్లెలు సహా కుటుంబం కూడా జగన్‌తో లేరు. సొంతవారే నమ్మకపోతే జగన్‌ను జనమెలా నమ్ముతారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని