PRATHIDWANI: వడ్డీ రేట్లపై ఆర్బీఐ నిర్ణయంతో ఎలాంటి పరిణామాలుంటాయి?
🎬 Watch Now: Feature Video
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచేసింది. దీంతో కొవిడ్ సంక్షోభం తర్వాత వరుసగా మూడోసారి రెపో రేటు పెంచినట్లైంది. రెపో పెంపునకు అనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే దిశగా కదులుతున్నాయి. ఈ మేరకు గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన, వ్యవసాయ రుణాలపై వడ్డీల భారం పెరగనుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మాంధ్యం పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే వడ్డీ రేట్లు పెంచామని ఆర్బీఐ ప్రకటించింది. అయితే... ఈ పెంపుదలతో అన్నిరకాల వస్తువులు, సేవల ధరలు పెరిగిపోతాయని, ప్రజలపై ఆర్థిక భారాలు మరింతగా పెరుగుతాయని ఆర్థికవేత్తలంటున్నారు. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల చోటుచేసుకునే పరిణామాలపై ఈ రోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST