విశ్వవిద్యాలయాల్లో ఏం జరుగుతోంది - రాజకీయాలతో వర్సిటీలకు, వీసీలకేంటి సంబంధం? - ETV Bharat Prathidwani programme

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2023, 9:36 PM IST

Prathidwani Debate on Plight of Universities in AP: రాజకీయాలతో విశ్వవిద్యాలయాలు, ఉపకులపతులకేంటి సంబంధం? చదువుల తోటల్లో.. ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా వైస్‌ ఛాన్సలర్ల మీడియా సమావేశాలు, విశ్వవిద్యాలయాల్లో నాయకుల పుట్టినరోజు వేడుకలు, పాలాభిషేకాల వంటి విపరీత పోకడలు రాష్ట్ర వర్సిటీల చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా? నాలుగున్నరేళ్ల జగన్ ఏలుబడిలో రాష్ట్ర ఉన్నతవిద్య దుస్థితిపై విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు, చివరకు న్యాయస్థానాల్ని కూడా ఆశ్చర్య పరుస్తున్న పరిణామాలివి. ఏయూ, ఏఎన్‌యూ, ఎస్కేయూ, వైవీయూ ఇలా పేరు, ప్రాంతం మారిన ప్రతిచోట ఇదేచిత్రం. 

రాష్ట్రంలో వర్సిటీలకు ఎందుకీ దుస్థితి? ఏయూ, ఏఎన్​యూలు అనే కాదు.. అనంతపురం శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీలో వైఎస్సార్​ విగ్రహం ఏర్పాటు ఉద్రిక్తతలకు దారి తీసింది. వర్సిటీల్లో ఈ విగ్రహాలు, పాలాభిషేకాలు, పుట్టినరోజు వేడుకలు, రాజకీయ ప్రచారాల్లో వీసీలు పాల్గొనడం.. ఎంతవరకు వాంఛనీయం ? వీటికి ఎవరు బాధ్యులు ?  విశ్వవిద్యాలయాల్ని రాజకీయ కేంద్రాలుగా మార్చడమే కాదు.. వాటి ఆర్థిక నిధుల్ని కూడా గుప్పిట పట్టేందుకు జగన్ సర్కార్ ప్రయత్నించింది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని వందల కోట్లు మళ్లించారు. అది సరైన నిర్ణయమేనా ? ఈ వీసీలు, పాలకవర్గాలు ఏం చేశాయి ఆ విషయంలో ?  ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.