PRATHIDWANI ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పించేందుకే సవరణలా - amendments to teachers election duty
🎬 Watch Now: Feature Video

పీఆర్సీ సహా వివిధ అంశాల్లో గుర్రుగా ఉన్న టీచర్లను.. ఎన్నికల విధులకు దూరం పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దశాబ్దాల నాటి విధానాన్ని పక్కనపెడుతూ, బోధనేతర పనుల్లో ఉపాధ్యాయులు పాల్గొనరాదంటూ... విద్యా హక్కు చట్టం నిబంధనలకు కీలక సవరణలు చేసింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్నిశాఖల ఉద్యోగులు పాల్గొన్న తర్వాత అవసరమైతేనే బోధనేతర పనుల్లో టీచర్ల భాగస్వామ్యం ఉండాలని ఆదేశించింది. ఎన్నికలకు టీచర్ల సేవలు అవసరం లేదని పరోక్షంగా సూత్రీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక లోగుట్టు.. ఎన్నికల విధుల నుంచి తప్పించడమేనా. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల విధుల సంగతి అటుంచి.. ప్రతిరోజూ చికాకు పెట్టే యాప్‌ల భారం తొలగించాలంటున్న టీచర్ల వాదనను ఎలా చూడాలి.. ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST