Prathidwani: అనంతబాబు డ్రైవర్ హత్య కేసు.. తేలాల్సిన నిజాలెన్ని..? - ETV Bharat Prathidhwani
🎬 Watch Now: Feature Video
Prathidwani Debate on Anantha Babu Driver Murder Case: అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతుల్లో అత్యంత దారుణంగా హతమైన తన మాజీ డ్రైవర్.. దళిత యువకుడైన సుబ్రమణ్యం హత్యకేసులో నిగ్గు తేలాల్సిన నిజాలు ఎన్నో ఉన్నాయి. అయితే దళితుల రక్షణపై ఉలిక్కిపడేలా చేసిన నాటి దయనీయమైన సంఘటనలో.. బాధిత కుటుంబ సభ్యులు, దళిత సమాజం సమాధానాలు ఆశిస్తున్న ప్రశ్నలు ఏమిటి? ఇదే కేసుకు సంబంధించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలోనూ విచారణ కీలక దశకు చేరుకుంది. పోలీసుల వైఖరి ఇలా ఉండబట్టే.. దర్యాప్తుపై బాధితులకు నమ్మకం పోతోందన్న హైకోర్టు.. కేసుని సీబీఐకి ఇవ్వడంపై తీర్పు రిజర్వ్ చేసింది. అసలు ఒక పేద దళిత యువకుడిని దారుణంగా చంపిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ వచ్చిన విధానం, తర్వాత పాలాభిషేకాలు, ఊరేగింపులు, బహిరంగ సభల్లో సీఎం జగన్ పక్కనే కూర్చో పెట్టుకోవడాన్ని ఎలా చూడాలి? ఈ కేసులో మొదట్నుంచీ ఎన్నో అనుమానాలు.. ప్రారంభంలోనే పోలీసులు చెప్పిన కథకు.. పోస్టుమార్టం నివేదికకూ పొంతన కుదరని పరిస్థితి. దీనిలో మీరు అనుమానిస్తున్న కోణాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.