హక్కుల కోసం ఉద్యోగ, కార్మిక సంఘాల పోరుబాట
🎬 Watch Now: Feature Video
Prathidhwani: రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి ఉద్ధృతంగా సాగుతున్నాయి ఉద్యమాలు. ఇచ్చిన హామీలు, చేసిన బాసల అమలు ఏమైంది జగనన్నా అంటూ, పోరుబాట పడుతున్నారు ఉద్యోగ, కార్మిక సంఘాలు. వేదన తీరుస్తామన్నారు, ఆవేదనే మిగిల్చారని మున్సిపల్ కార్మికులు, క్రమబద్దీకరణ, ఉద్యోగ భద్రత కోరుతూ, సమగ్రా శిక్షా కార్మికులు, ఆశాలు, అంగన్‌వాడీలు, చివరకు వాలంటీర్లు కూడా నిరసన పథంలోకి చేరుతున్నారు. మరి ఎందుకీ పరిస్థితి? ఉద్యోగ, కార్మిక వర్గాలకు జగన్ ఏం చెప్పారు? ఏం చేశారు? మోసపోయామనే ఆవేదన, ఆక్రోశంతో వారంతా ఇలా రోడ్లపైకి వచ్చి గోడు వెళ్లబోసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు స్కీమ్ వర్కర్లను కూడా కలుపుకుంటే మరో 3.1 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా. అసలు వీళ్లందరి జీవన స్థితిగతులెలా ఉన్నాయి? అంగన్‌వాడీల ఉద్యమంలో ఒకవైపు వారి చర్చలకు పిలుస్తున్న ప్రభుత్వం మరోవైపు తాళాలు పగలగొట్టి కేంద్రాలు స్వాధీనం చేసుకోవడం, తొలగిస్తామని హెచ్చరికలు పంపడాన్నెలా చూడాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.