Prathidhwani నిరుపేదలకు కనీస ఆవాసం కలేనా..! నిధులుండి.. ఎందుకీ వెనకబాటు? - house construction for poor in Andhra

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 9:52 PM IST

Prathidhwani: రాష్ట్రంలో పేదలకు ఇళ్లు కాదు.. ఊళ్లే కడుతున్నాం అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి. గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో అసలు ఎంతమంది పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు? వైసీపీ మానిఫెస్టోలోనే 5ఏళ్లలో 25లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. 2020 డిసెంబర్‌న 2 దశల్లో 28.3లక్షల కోట్ల ఇళ్లు కట్టించబోతున్నామని ప్రకటించారు. వాస్తవంలో అవన్నీ ఏమయ్యాయి? రాష్ట్రవ్యాప్తంగా 13వేల పంచాయతీలుంటే... 17,005 వైస్సాఆర్ జగనన్న కాలనీలు రానున్నట్లు గొప్పగా చెప్పారు. చెబుతునే ఉన్నారు. ఆ కాలనీల వద్ద అసలు వాస్తవ పరిస్థితి ఏమిటి?  దేశంలోని ఏ ఇతరరాష్ట్రంతో చూసినా ఏపీలో పేదలఇళ్లు నిర్మించడంలో అట్టడుగున ఉన్నట్లు కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి. ఇళ్ల కేటాయింపులు, నిధులు ఉండి... ఎందుకీ వెనకబాటు? ప్రతి పేదవాడికీ ఇచ్చే ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు 2.70 లక్షలుగా నిర్ణయించినట్లు ప్రభుత్వమే ప్రకటించింది. ఇవాల్టి పరిస్థితులు, ధరల ప్రకారం అసలు ఆ ధరల్లో ఇంటి నిర్మాణం సాధ్యమేనా... ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.