జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎందుకీ ప్రాణ సంకటం? - నిరుద్యోగుల ఆందోళన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 10:23 PM IST
Prathidhwani: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసీ, చూసీ నిరుద్యోగుల గుండెలవిసిపోతున్నాయి. ఒకవైపు వయసు అయిపోతోంది. మరోవైపు పట్టణాలు, నగరాల్లో ఏళ్ల తరబడి అద్దెలు, కోచింగ్‌లకు ఖర్చులకు తాళలేక బాధల్ని పంటి బిగువున భరిస్తున్నారు. భరించలేని వాళ్లు, ఉద్యోగాలు దక్కక, భవిష్యత్‌పై భరోసా చిక్కక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల వెలువడిన ఎన్సీఆర్బీ నివేదికల్లో వెల్లడైన చేదు నిజాలే ఇవన్నీ. జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎందుకీ ప్రాణ సంకటం? అసలు ప్రతిపక్షంలో ఉండగా జగన్ నిరుద్యోగులకు ఏం హామీలిచ్చారు? నమ్మి ఓట్లేసిన వారంతా ఇప్పుడేం ఆలోచిస్తున్నారు? ప్రభుత్వరంగంలో ఎలాగూ ఉద్యోగాల్లేవు. కనీసం ప్రైవేటు రంగంలోనైనా రాష్ట్ర యువతకు ఉపాధి దొరికే పరిస్థితి ఉందా? ప్రైవేటు పెట్టుబడులు ఎందుకు రావట్లేదు? ఎందుకు ఆంధ్రా యువత వలసలు పోతోంది? గత ప్రభుత్వంలో నిరుద్యోగ భృతితో పాటు స్వయం ఉపాధి, ప్రైవేటు రంగంలో అవకాశాల కోసం నైపుణ్యశిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ విషయంలో జగన్ ఏం చేశారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.