శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా ప్రదోష నంది సేవ - Pradosha Nandi Seva in kalahasti
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-11-2023/640-480-19998532-thumbnail-16x9-pradosha-nandi-seva-to-sri-kalahasteeshwara-temple.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 11, 2023, 12:22 PM IST
Pradosha Nandi Seva to Sri kalahasteeshwara Temple: తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా ప్రదోష నంది సేవను అర్చకులు నిర్వహించారు. శుక్రవారం కాళహస్తీశ్వర ఆలయంలోని అలంకార మండపం వద్ద శ్రీ సోమ స్కంద మూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవి అమ్మవారికి వేద మంత్రాలతో పండితులు ప్రత్యేక పూజలు జరిపించారు.
Swami Ammavarlu is a special Decoration : నంది వాహనం పై స్వామి అమ్మవార్లు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆది దంపతులను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు.రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మెుక్కులు చెల్లించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి అమ్మ వార్ల దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు రావటంతో ఆలయంలో సందడి నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆలయ సిబ్బంది తెలిపారు.