Pomegranate Farmer Lost Due to Lack of Rain: మట్టిపాలైన ఐదేళ్ల కష్టం.. రూ.15లక్షల పెట్టుబడి... దానిమ్మ రైతు కంటతడి
🎬 Watch Now: Feature Video
Pomegranate Farmer Lost Due to Lack of Rain: ప్రకాశం జిల్లా గుర్రపుశాలకి చెందిన ఓ రైతు.. దానిమ్మ సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. ఐదేళ్ల కిందట మూడెకరాల్లో దానిమ్మ మొక్కలను నాటానని రైతు ఏడుకొండలు తెలిపారు. ఇటీవల తీవ్ర వర్షాభవంతో దానిమ్మ చెట్లన్నీ ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతోపాటు ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న కాయలకు సైతం వైరస్ సోకడంతో చెట్లను తొలగించాల్సి వచ్చిందని వాపోయాడు. సుమారు 15 లక్షల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టగా.. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా వచ్చేలా లేదని కన్నీటిపర్యంతమయ్యాడు. తీవ్రంగా నష్టపోయిన తనను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని బాధిత రైతు ఏడుకొండలు కోరారు.
"నేను దానిమ్మ సాగు చేసి తీవ్రంగా నష్టపోయాను. ఇటీవల తీవ్ర వర్షాభావంతో దానిమ్మ చెట్లన్నీ ఎండిపోయాయి. దీంతోపాటు ఇప్పుడిప్పుడే చేతికొస్తున్న కాయలకు సైతం వైరస్ సోకడంతో చెట్లను తొలగించాల్సి వచ్చింది. సుమారు 15 లక్షల రూపాయల వరకూ సాగుపై పెట్టుబడి పెట్టగా.. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా వచ్చేలా లేదు. తీవ్రంగా నష్టపోయిన మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి." -జింకల ఏడుకొండలు, రైతు