ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ - ఆంధ్రా ఒడిశా సరిహద్దు
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 2:05 PM IST
Police Seized Maoist Dump in Andhra Odisha Boarder : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే డంప్‌లో ఉన్నభారీ పేలుడు సామగ్రి చూసి పోలీసులు విస్తు పోయారు. పోలీసుల కథనం ప్రకారం దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఏవోబీ(Andhra Odisha Boarder)లోని మత్లీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కిరిమితి - తులసీ అటవీప్రాంతంలో డీవీఎఫ్, ఎస్‌వోజీ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు భారీ డంప్‌ను వెలికితీశారు.
Maoist Dump at Andhra Odisha Boarder : ఈ డంప్‌ను తెరిచి చూసేసరికి దానిలో భారీ పేలుడు సామగ్రి ఉండటం గుర్తించారు. ఎక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. డంప్‌లో ఒక దేశవాళీ తుపాకీ, 150 జెలిటెన్ స్లిక్స్, 13 మందుపాతరలు, 13 మీటర్ల కోర్డెక్స్ వైరు లభించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సాధరణ పౌరులు, గాలింపు బలగాలే లక్ష్యంగా ఈ పేలుడు సామగ్రిను దాచి ఉంచారని పోలీసులు భావిస్తున్నట్లు పేర్కొన్నారు.