Dangerous driving: ప్రమాదకర రీతిలో బైక్‌పై విన్యాసాలు.. యువకుడిపై కేసు నమోదు - ఏపీ వార్తలు
🎬 Watch Now: Feature Video
Dangerous driving: రోడ్డుపై మనం వాహనం నడిపేటప్పుడు ఎంతో బాధ్యతగా నడపాలి. కానీ అలా మనల్ని ఎవరూ చూడడం లేదని కొంతమంది ఆకతాయిలు చేసే పనులు అన్నీఇన్నీ కావు. కానీ ఇప్పుడు సెల్ఫోన్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఎవరు ఏం చేసినా కొద్ది క్షణాల్లోనే ప్రపంచానికి తెలిసిపోతుంది. సరదా కోసం చేసే పనులు.. తమ ప్రాణాలతో పాటు.. ఎదుటివారి ప్రాణాలు కూడా తీసే స్థాయికి చేరుతున్నాయి.
బైక్‌పై విన్యాసాలు చేస్తూ వేగంగా నడిపిన ఓ యువకుడిపై.. కోనసీమ జిల్లా రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈతకోట గ్రామానికి చెందిన తరుణ్ కుమార్ అనే యువకుడు ద్విచక్రవాహనంపై నిలబడి వేగంగా, ప్రమాదకర రీతిలో వాహనాన్ని నడిపాడు. యువకుడి విన్యాసాల్ని వెనకాల వస్తున్న కారులో ఉన్న వ్యక్తి.. ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. విషయం పోలీసుల వరకు చేరడంతో యువకుడ్ని గుర్తించి కేసు నమోదు చేసి బైక్‌ను సీజ్ చేశారు.