Police Attack on Husband Wife Suicide Attempt: భర్తపై పోలీసుల దాడి.. మనస్థాపంతో భార్య ఆత్మహత్యాయత్నం - భార్య సూసైడ్ అటెంప్ట్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 13, 2023, 10:32 PM IST
Police Attack on Husband Wife Suicide Attempt: న్యాయం చేయాల్సిన పోలీసులే తమపై దాడి చేశారనే మనస్తాపంతో.. ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. చెరువులోపాలెం గ్రామనికి చెందిన రూతమ్మ అనే మహిళపై వైసీపీకి చెందిన నవీన్ , వీరేంద్ర, వినోద్ అనే యువకులు దాడి చేశారు. ఈ విషయంపై రూతమ్మ కుమారుడు రమేశ్.. చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవటంతో దిశ పోలీసులను ఆశ్రయించారు. దీంతో వైసీపీ నాయకులు ఈనెల 7న.. తనపై, భర్త రమేశ్‌పై దాడికి పాల్పడ్డారని భార్య దుర్గ తెలిపారు. దీనిపై రమేశ్ మరోసారి చేబ్రోలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
ఈ క్రమంలో తన భర్తను ఎస్సై ఆనంద్ కొట్టారంటూ దుర్గ మనస్తాపంతో నిద్రమాత్రలు మింగినట్లు వివరించింది. బాధితురాలు ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ బాధితురాలిని పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.