Live Video: వానొచ్చిందంటే ఉప్పొంగే వాగు.. 'తాడు'తోనే వారి ప్రయాణం సాగు - pippergongi latest news
🎬 Watch Now: Feature Video
Live Video: తెలంగాణలోని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమై.. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతాల గ్రామాలకు నిత్యావసర సరకుల కోసం, పొలాల్లో పనుల కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వాంకిడి మండలం పిప్పర్గొండి గ్రామానికి వర్షాకాలం వచ్చిందంటే మధ్యలో ఉన్న వాగు ఉప్పొంగడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. వంతెన లేక, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వాగుకు రెండు వైపులా తాడు కట్టి దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST