Petition In High Court On Appointments of TTD Members: ఆ ముగ్గురిని తొలగించండి.. టీటీడీ పాలకమండలి నియామకాలపై హైకోర్టులో పిటిషన్

🎬 Watch Now: Feature Video

thumbnail

Petition In High Court On Appointments of TTD Members: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సభ్యుల నియామకాల విషయంలో గతకొన్ని రోజులుగా  వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ పాలకమండలి నియామకాలను సవాల్‌ చేస్తూ.. మంగళవారం నాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేరచరితులు, మద్యం వ్యాపారులను తితిదే బోర్డులో నియమించడం సరికాదంటూ.. చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్​లో.. వైఎస్సార్సీపీ శాసనసభ్యుడు సామినేని ఉదయభాను, శరత్‌చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్లను తక్షణమే తొలగించాలని కోరారు. టీటీడీ నియామకాల అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 25వ తేదీన టీటీడీ బోర్డు సభ్యులుగా మొత్తం 24 మందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అందులో క్రిమినల్ కేసులు ఉన్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, లిక్కర్ స్కామ్​లో ఆరోపణలు ఎదుర్కొన్న శరత్ చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్​లను బోర్టు సభ్యులుగా నియమించింది. ఈ ముగ్గురినీ టీటీడీ బోర్డు సభ్యుల నుంచి తక్షణమే తొలగించాలంటూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.