విభిన్న ప్రతిభావంతులకు గుర్తింపు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం: దేవినేని ఉమా - TDP NTR Bhavan mangalagiri
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 8:46 AM IST
Persons with Disabilities Day Celebrations in NTR Bhavan: విభిన్న ప్రతిభావంతులకు గుర్తింపు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. విభిన్న ప్రతిభివంతులకు ఆర్థిక ఇబ్బందులు తొలగించి అండగా ఉండేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు అనేక విధాలుగా గుర్తింపునిచ్చి ఎన్టీఆర్, చంద్రబాబు వారిని వృద్ధిలోకి తెచ్చారని ఉమ తెలిపారు.
దివ్యాంగులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న వారికి ఎన్ఆర్ఐల ద్వారా ఆర్థికంగా టీడీపీ ఆదుకుంటుందని తెలిపారు. చదువుతో నిమిత్తం లేకుండా దివ్యాంగుల వివాహ ఖర్చులకు లక్ష రూపాయల ప్రోత్సాహం ఇప్పిస్తామని దేవినేని ఉమా హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వస్తేనే విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం సాధ్యమని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల విభాగం గౌరవ అధ్యక్షుడు కోటేశ్వరరావు, అధ్యక్షుడు పూదోట సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.