People Fell Ill Due to Food Poisoning in Visakha: ఫుడ్ పాయిజన్ కావటంతో విశాఖలో 13మంది యువకులకు అస్వస్థత - Food poisoning for youth in Visakhapatnam
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 10, 2023, 1:15 PM IST
People Fell Ill Due to Food Poisoning in Visakha: సరదాగా పార్టీ చేసుకుందామని వెళ్లిన ఆ యువకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఫుడ్ పాయిజన్ కావటంతో 13 మంది యువకులు అస్వస్థతకు గురైన ఘటన విశాఖలో జరిగింది. ములగాఢ గ్రామానికి చెందిన యువకులు ఆదివారం రాత్రి పాతగాజువాకలోని మండి క్రూడ్ హోటల్లో బిర్యాని తిన్నారు. భోజనం చేసి ఇంటికి వచ్చిన వారిలో 13 మందికి సోమవారం వేకువజామున 4 గంటల నుంచి వాంతులు విరేచనలు మొదలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం నగరంలోని కేజీహెచ్ హాస్పిటల్లో కుటుంబ సభ్యులు చేర్చారు. చికిత్స అనంతరం ఇంటికివెళ్లిన బాధితుల్లో నలుగురు యువకులు పరిస్థితి విషమించటంతో సెయింట్ ఆన్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ పిల్లలకు ఇంత విషమంగా ఉన్నా సరే ఇప్పటి వరకూ సంబంధిత హోటల్ యజమానులు పట్టించుకోలేదని.. తక్షణమే కలుషిత ఆహారం వడ్డించిన హోటల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబసభ్యులు కొరుతున్నారు.