అడుగుకో గొయ్యి, గజానికో గుంత - అధ్వానంగా పలాస రహదారులు - పలాస లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 2, 2023, 10:46 PM IST
People Facing Problems with Damaged Roads: శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని బెండిగేట్ నుంచి పూండి వెళ్లే రహదారి గుంతలు పడి దారుణంగా తయారైంది. మంత్రి అప్పలరాజు స్వగ్రామానికి వెళ్లే రహదారైనప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగుకో గొయ్యి.. గజానికో గుంతలతో అధ్వానంగా ఉన్న ఈ రహదారిపై ప్రయాణమంటేనే భయపడుతున్నట్లు తెలిపారు. గుంతల మయమైన ఈ రహదారిపై తరచూ ప్రమాదాలకు గురవుతున్నామని వాపోయారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు మరమ్మతులు మాత్రం చేయడంలేదని వాపోతున్నారు.
ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన మంత్రి అప్పలరాజు అధికారం వచ్చాక కనీసం పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఈ రహదారిని డబుల్ రోడ్డు చేస్తామని.. 56 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు ఉన్నా.. ఆచరణ మాత్రం అమలు కావడంలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ ప్రాంతంలో రహదారి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.