Varahi Meeting Postponed: పవన్ కల్యాణ్ వారాహి సభకు బ్రేక్.. అందుకోసమే అన్న పార్టీ వర్గాలు - Pawan Kalyan Varahi Meeting Postponed

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 24, 2023, 3:53 PM IST

Pawan Kalyan Varahi Meeting Postponed: ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వరుస రోడ్‌షోలు, బహిరంగసభల పర్వానికి బ్రేక్‌ పడింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ సాయంత్రం మలికిపురంలో నిర్వహించాల్సిన సభ వర్షం కారణంగా వాయిదా వేశారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు జనసేన మీడియా విభాగం ప్రకటన విడుదల చేశారు. రేపు వాతావరణ పరిస్థితులను పరిశీలించి.. వారాహి యాత్ర, సభల నిర్వహణపై తదుపరి నిర్ణయం ఉంటుందని ప్రకటనలో తెలిపారు. సాయంత్రం పి. గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులతో పవన్ సమావేశం నిర్వహించనున్నారు.

వారాహి విజయ యాత్రలో భాగంగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్లు అవుతోందని.. అరణ్యవాసం ముగించుకుని బయటకు వచ్చానని అన్నారు. తాను చేసే యుద్ధం మార్పు కోసమని అన్నారు. అన్ని కులాలు కొట్టుకోకుండా అంతా కలిసిమెలిసి ముందుకు వెళ్లడమే వచ్చే ఎన్నికల ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.